Header Banner

ముదురుతున్న కేశినేని బ్రదర్స్ వార్! ఈసారి ఏకంగా ఆయనకి ఫిర్యాదు!

  Sun May 11, 2025 09:48        Politics

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య వివాదం మరింత రాజుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో చిన్నికి సంబంధాలున్నాయని నాని ఆరోపించడమే కాక తాజాగా దీనిపై ఈడీకి ఫిర్యాదు చేశారు. ఏపీ మద్యం స్కామ్ కేసును పూర్తి స్తాయిలో దర్యాప్తు చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

 

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని...మాజీ ఎంపీ కేశినేని నానిల మధ్య వివాదం మరింత ముదురుతుంది. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కాం కేంద్రంగా అన్నదమ్ముల మధ్య వివాదం మొదలైంది. ఇరువురు ఒకరి మీద ఆరోపణలు చేసుకుని.. బెజవాడ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి సత్సంబంధాలు ఉన్నాయని... ఇద్దరు కలిసి వ్యాపార లావాదేవీలు జరిపారని ఆరోపిస్తూ కేశినేని నాని సంలచన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఏకంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఫిర్యాదు చేశారు కేశినేని నాని. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

 

ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

కేశినేని నాని.. ఈడీకి రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏపీ మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ కేసుల్లో.. విజయవాడ ఎంపి కేశినేని చిన్ని, ఆయన వ్యాపార భాగస్వామి రాజ్ కసిరెడ్డిలతో పాటుగా.. ఈ కుంబకోణంలో పాలు పంచుకున్న వారందరిని విచారించాల్సిందిగా నేను ఈడీకి లేఖ రాశాను.ఈ కేసుకు సంబంధించి ఈడీ చిన్ని, రాజ్ కసిరెడ్డికి చెందిన వారి అన్ని .. ఇండియా, విదేశాల్లో ఉన్న అన్ని కంపెనీల్లో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరాను అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.



ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో రూ. 3,200 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ జరిగిందని కేశినేని నాని ఆరోపించారు. అంతేకాక దీని వెనుక తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న వ్యక్తే సూత్రధారి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి.. రాజ్ కసిరెడ్డితో పాటు మరో ముగ్గురికి మాత్రమే ప్యాలెస్‌లోకి ప్రవేశం ఉందని నాని ఆరోపించారు. అంతేకాక చిన్ని సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని కేశినేని చిన్ని సీబీఐకి లేఖ రాయడాన్ని.. నాని చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

 

అయితే ఈ ఆరోపణలపై స్పందించిన చిన్ని.. రాజ్ కసిరెడ్డితో తాను వ్యాపార లావాదేవీలు జరిపిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కసిరెడ్డికి జగన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిసిన తర్వాత ఆయనకు తాను దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్, ఇసుక మాఫియాపై నాని ఎందుకు ఒక్కసారైనా ప్రశ్నించలేదని నిలదీశారు. ఇప్పుడు తాజాగా నాని.. ఈడీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈవ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూాడాలి అంటున్నారు విజయవాడ వాసులు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KeshineniBrothersWar #LiquorScamAP #VijayawadaPolitics #EDComplaint #KeshineniNani #KeshineniChinni #APLiquorScam